- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లంగ్స్ హెల్త్‌ను మానిటర్ చేసే వెస్ట్‌కోట్!
దిశ, ఫీచర్స్ : మానవ ఆరోగ్యం విషయంలో కీలకంగా మారిన ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హెచ్చరిస్తుంటారు వైద్యులు. ఏ మాత్రం అలసత్వం వహించినా ప్రాణానికే ప్రమాదమని, అందుకే ఎప్పటికప్పుడు లంగ్స్ హెల్త్ చెక్ చేసుకోవాలని సూచిస్తుంటారు. కానీ బిజీ లైఫ్‌లో ఆస్పత్రికి వెళ్లాలంటే కుదరకపోవచ్చు.. అందుకని ఈ సమస్యకు పరిష్కారంగా జర్మనీ పరిశోధకులు ఓ వెస్ట్ కోట్‌ను రూపొందించారు.
జర్మనీకి చెందిన పరిశోధన సంస్థ ఫ్రాన్‌హోఫర్ సొసైటీ.. కరోనా సోకిన వారిలో దాదాపు 80 శాతం మందిలో శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడ్డాయని గ్రహించి, ఆ రోగులను లక్ష్యంగా చేసుకుని పరిశోధనలు సాగించింది. ఈ మేరకు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసేందుకు వీలుగా 'న్యూమో వెస్ట్(Pneumo.Vest)' అని పిలిచే వేరబుల్ వెస్ట్‌కోట్‌ను డెవలప్ చేసింది.
వెస్ట్‌కోట్ ముందు, వెనుక భాగంలో మల్టిపుల్ పైజోసెరామిక్ అకౌస్టిక్ సెన్సార్లు ఉండగా, ఇవి ఊపిరితిత్తుల ద్వారా ఉత్పత్తి అయ్యే అతి చిన్న శబ్దాలను కూడా గుర్తిస్తాయి. ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అన్ని సెన్సార్ రీడింగ్స్‌ను రికార్డ్ చేయడం సహా విశ్లేషిస్తుంది. ఈ మేరకు సమస్యాత్మక ప్రాంతాలను హైలైట్ చేసే ఊపిరితిత్తుల చిత్రాన్ని రూపొందించి, ఆ ఇమేజ్‌ను లింక్ చేసిన మొబైల్‌కు సెండ్ చేస్తుంది. ఈ విధంగా కొత్త సాంకేతికత ఊపిరితిత్తులను నిరంతరం పర్యవేక్షించేందుకు దోహదపడుతుందని, ఇది శ్వాసకోశ రోగులతో పాటు, సాధారణంగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.