డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

by Web Desk |
డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
X

దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలక కార్యాలయంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కళ నేరవేరబోతుందన్నారు. అనంతరం పురపాలక పరిధిలోని సుమారు 589 మంది ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేసి.. వారి పేర్లు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు.

రానున్న మార్చి నెల ఆఖరి వరకు ప్రతి ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు డబుల్ ఇళ్లు వచ్చే విధంగా చూస్తామని చెప్పారు. మొదటి విడతలో ఇళ్లు రాని వారికి రెండో విడతలో వచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే బడ్జెట్‌లో సొంత ఇంటి స్థలం ఉండి, ఇళ్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పారు. అదేవిధంగా ఈ నెల 23న మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారని వెల్లడించారు.

ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. పేదోడి సొంత ఇంటి కళను నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మిస్తున్న డబుల్ ఇండ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డబుల్ ఇండ్ల విషయంలో ఎవ్వరూ పైరవీలు చేయడం కుదరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గన్నె వనిత, ఎంపిపి పుష్పలత, అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఆర్డీవో అనంతరెడ్డి, ఎమ్మార్వో సలీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story