- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ
దిశ, లక్షెట్టిపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొనిఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా బంధు మూడు రోజుల సంబరాల్లో భాగంగా టీఅర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం లక్షెట్టిపేటలోని ఆర్ అండ్ బీ విశ్రాంతి భవనం ఆవరణలో మున్సిపాలిటీ పారిశుద్ధ్య మహిళా కార్మికులను శాలువాలతో సన్మానించి చీరలను బహూకరించారు. ఈ సందర్భంగా లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. అంతకుముందుగా పారిశుద్ధ్య మహిళా కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టీ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి సంధ్య జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు గడ్డం వికాస్, కౌన్సిలర్లు రాజన్న, శ్రీకాంత్, కో-ఆప్షన్ సభ్యుడు షాహిద్ అలీ, నాయకులు రమేష్, సలీం, సజ్జు, రవీందర్, సురేష్, దీప్ చంద్ తదితరులు పాల్గొన్నారు.