- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమోసా తెలుసేమో కానీ, 'క్రమోసా' తెలుసా.. దాని రేటు..?!
దిశ, వెబ్‌డెస్క్ః 'కాకరకాయ, కీకరకాయ అయ్యిందని' ఓ సామెతుంది. అయితే, మనుషులకు ఉపయోగించే ఈ సామెత ఇప్పుడు మనుషులు తయారుచేస్తున్న ఫ్యూజన్ ఫుడ్‌కు పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుత కాలంలో సంకర ఆహారం సూపర్ సక్కెస్ అవుతోంది. అంతేనా, ఇదే నెట్టింట్లోనూ అటెన్షన్-సీకింగ్ ట్రెండ్‌గా మారింది. అయితే ప్రస్తుతం మనం మాట్లాడుకునే 'క్రమోసా' అనే పదార్థం 'సమోసా'నే క్రమంగా మార్పు చెంది 'క్రమోసా'గా పరిణామం చెందింది. ఇది జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసిన వైరస్ అనుకోండి, కళ్ల ముందు కనిపించే పీడకల అనండి ట్రెండ్ మాత్రం ఎవ్వరి మాట వినదంతే. అలాగని, క్రమోసా రోడ్డు మీద తయారుచేసిందని అస్సలు అనుకోవద్దు ఎందుకంటే ఏకంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్న రిచ్ ప్లేస్, కోస్టాలో కొలువుదీరింది.
ఐస్ క్రీం సమోసా, సమోసా గులాబ్ జామూన్ వెర్షన్ తర్వాత, 'క్రామోసా' ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ అయ్యింది. పుదీనా డిప్‌తో అందించే క్రామోసాను ప్రియల్ అనే ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ధర రూ.170 ప్లస్ పన్నులు కలిపి.. ఈ విచిత్రమైన చిరుతిండిని చూసి, నెటిజన్లు నాలిక్కరుచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లోనే అవాక్కయ్యి కాస్త కామెడీగానే సెటైర్లు వేస్తున్నారు. మీరూ చూడండి..
What pic.twitter.com/VlVnMwrrXa
— Priyal (@priyal) April 14, 2022