Samantha: ఆ స్టార్ హీరోను బ్రదర్ అన్న సమంత.

by sudharani |   ( Updated:2024-10-09 06:51:37.0  )
Samantha: ఆ స్టార్ హీరోను బ్రదర్ అన్న సమంత.
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జిగ్రా’. వాసన్ బాలా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్, ఎటర్‌నల్ బ్యానర్స్‌పై కరణ్ జోహార్ నిర్మించారు. తమ్ముడి కోసం అక్క చేసే పోరాటం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో.. తాజాగా ‘జిగ్రా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు చిత్ర బృందం. ఈ ఈవెంట్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, రానా దగ్గుబాటి, సమంతలు ముఖ్య అథితులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా సమంత మాట్లా్డుతూ రానాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘హీరోయిన్లుగా మాపై కొంత బాధ్యత ఉంటుంది. అమ్మాయిలు వారి జీవితాలకు వాళ్లే హీరోలు అని చెప్పేందుకు అప్పుడప్పుడు ఇలాంటి కథలు చెప్పాల్సి వస్తుంది. ఆలియా నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆమె ఒకవైపు నటిస్తూనే.. మరో వైపు సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు. ఇక రానా గత నెలలోనే ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాన్ని ఇచ్చారు. ఇప్పుడు జిగ్రాను ఇస్తున్నారు. ప్రతీ అమ్మాయికి రానా లాంటి బ్రదర్ ఉండాలి’ అని కామెంట్స్ చేసింది. ప్రజెంట్ ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read: వారే నా ఫ్యామిలీ, దానికి నేను ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతాను.. స్టేజి మీదనే బోరున ఏడ్చేసిన సమంత

Advertisement

Next Story

Most Viewed