చైతూకి షాకిచ్చిన సమంత.. ఆ పని ఎందుకు చేసింది ?

by samatah |   ( Updated:2022-03-22 03:44:42.0  )
చైతూకి షాకిచ్చిన సమంత.. ఆ పని ఎందుకు చేసింది ?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో లవ్‌లీ కపుల్ అంటే సమంత, నాగచైతన్యనే. ఇక ఈ జంటకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఎంతో మంది ఇష్టపడే వీరు ఒక్కసారిగా విడాకులు తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు. విడిపోయిన తర్వాత సామ్ కొటేషన్స్ పోస్టు చేస్తూ తన బాధను తెలిపేది. అయితే విడాకుల తర్వాత సామ్ చై ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సామ్ తన ఇన్ స్టాగ్రామ్ నుంచి నాగచైతన్య ను అన్‌ఫాలో చేసి, తన ఫొటోస్‌ను డిలీట్ చేసింది. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట వైరల్‌గా మారింది. సామ్ చైని అన్ ఫాలో చేసింది, కానీ అక్కినేని, దగ్గుపాటి ఫ్యామిలీ మెంబర్స్‌ని మాత్రం ఫాలో అవుతూనే వస్తుంది. అయితే సమంత చైతూని అన్ ఫాలో చేయడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విడాకులతో కుంగిపోయిన సమంత.. ఆ జ్ఞాపకాలను మర్చిపోవడానికి చైతూ మెమోరీస్‌ను, చై ఫొటోలను డిలీట్ చేస్తుంది అంటూ కొందరు చెప్పుకుంటున్నారు. అయితే చైతూ మాత్రం ఇన్ స్టాలో సామ్‌ని ఫాలో అవుతూనే ఉన్నారు, ఇక వారిద్దరు కలిసి ఉన్నప్పటి ఫొటోస్ కూడా డిలీట్ చేయలేదు. కానీ ట్విట్టర్‌లో మాత్రం సమంత, చైతూ ఒకరిని ఒకరు ఫాలో కావటం మానేశారు.

Advertisement

Next Story