- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: టాటూపై స్పందించిన సమంత.. షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ అగ్ర నటి సమంత తన అభిమానులకు ఓ చక్కటి సలహా ఇచ్చింది. ఇకపై తన ఒంటిపై టాటూ వేసుకోనని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్‌లో భాగంగా నెటిజన్స్ ప్రశ్నలకు బదులిచ్చిన సామ్.. ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు సమంత శరీరంపై మొత్తం మూడు టాటూలుండగా.. ఒకటి మెడ కింద వెనుకభాగంలో 'వైఎంసీ' అంటే 'ఏం మాయ చేశావే' అని అర్ధం. రెండవది కుడివైపు పక్కటెముకపై 'చే' అని రాసుకుంది. ఇక మూడవది చాలా ప్రత్యేకమైనది.
సమంత, నాగచైతన్యలిద్దరూ పెళ్లిచేసుకున్నాక చేతిపై రెండు బాణాల గుర్తులు వేయించుకున్నారు. అయితే వీటిని ఉద్ధేశిస్తూ.. కొన్ని టాటూల్ని మీరు ఏదో ఒకరోజు ప్రేమిస్తారు కదా? అని ఓ అభిమాని ప్రశ్నించాడు. దానికి నవ్వుతూనే సమాధానమిచ్చిన నటి.. ఇకపై ఎలాంటి టాటూలు వేసుకోనని, ఎవరూ ఎప్పటికీ వేసుకోద్దని స్పష్టంగా చెప్పడం విశేషం. అలాగే మహిళలకు మీరిచ్చే సందేశమేంటని అడిగినప్పుడు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సామ్.. 'నీపై నీవెప్పుడు సందేహపడవద్దు. ఇతరులు నీ బిహేవియర్ నచ్చలేదని చెప్పినా లైట్ తీసుకోండి' అని చెప్పుకొచ్చింది.
- Tags
- samantha