- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SRHపై సల్మాన్ భట్ సంచలన వ్యాఖ్యలు.. 'పిచ్ మారినా వారి రాత మారలే'
దిశ, వెబ్‌డెస్క్: మార్చి 26న ప్రారంభమైన ఐపీఎల్ 15వ సీజన్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జట్లకు ఆదిలోనే షాక్ తగిలింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు, ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్‌కు, సన్ రైజర్స్ హైదరాబాద్‌కు.. గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమవ్వడం, వరుస ఓటములతో షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.
అయితే, ఐపీఎల్‌పై పాక్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ స్పందించాడు. ఎస్ఆర్‌హెచ్ వరుస ఓటములపై ఆయన మాట్లాడుతూ.. 'పిచ్ ఏదైనా సన్ రైజర్స్ ఆటగాళ్ల తీరు మాత్రం మారడం లేదు. ఎస్‌ఆర్‌హెచ్ టీం ప్లాన్స్ సరిగ్గా లేవు. హార్డ్ హిట్టింగ్ చేయగల స్టార్ బ్యాటర్ మార్‌క్రమ్‌ను 4,5 స్థానాల్లో బ్యాటింగ్ దింపడం కరెక్ట్ కాదని పేర్కొన్నాడు. ఎస్ఆర్‌హెచ్ వరుస ఓటములు చూస్తుంటే.. ఆటగాళ్లకు, జట్టు యజమాన్యానికి మధ్య గాప్ ఉన్నట్లు అనిపిస్తుందని అన్నాడు. అంతే కాకుండా ఎస్ఆర్‌హెచ్ ఓటములపై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.