Sajjala Ramakrishna Reddy: బీజేపీతో పొత్తుపై వైసీపీ క్లారిటీ

by Sathputhe Rajesh |   ( Updated:2022-07-06 13:34:25.0  )
Sajjala Ramakrishna Reddy Says, YSRCP wont alliance with BJP
X

దిశ, డైనమిక్ బ్యూరో: Sajjala Ramakrishna Reddy Says, YSRCP won't alliance with BJP| రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ స్టాండ్‌ ఏంటో చెప్పాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యద‌ర్శి సజ్జల రామ‌కృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఎవరికి మద్దతు ఇంకా ఎందుకు బహిర్గతం చేయ‌లేదో చెప్పాలన్నారు. దీనిపై ఎల్లో మీడియా కూడా నోరు మెదపడం లేదని విమర్శించారు. వైసీపీ ప్లీనరీ కార్యక్రమంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. వైసీపీ పునాదులు, ఆలోచన విధానాలు, కార్యకర్తల తీరు, తమకు మద్దతు ఇస్తున్న వర్గాల తీరు బీజేపీకి పూర్తి భిన్నంగా ఉంటుంది. బీజేపీకి వైసీపీకి ఎలాంటి పొత్తు ఉండదు. ఒంట‌రిగానే జనం మన్ననలు పొందేలా జగన్‌ అడుగులు వేస్తున్నారు. బీజేపీ జాతీయ పార్టీ. వారి లక్ష్యాలు వేరే ఉంటాయి. మా విధానాలు, మా ల‌క్ష్యాలు వేరు. రాష్ట్ర ప్రయోజనాల కోసమేజగన్‌ పని చేస్తున్నారు. మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీకి కొన్ని అంశాల్లో మద్దతు ఇచ్చాము. కొన్ని అంశాల్లో వ్యతిరేకించామని సజ్జల తెలిపారు వైసీపీ సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ నెల 8, 9వ తేదీల్లో ప్లీన‌రీ స‌మావేశాలు నిర్వహిస్తున్నామ‌ని వెల్లడించారు

Advertisement

Next Story

Most Viewed