- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Sai Pallavi: ‘బాయ్‌కాట్ సాయి పల్లవి’ అంటూ నెట్టింట దుమారం.. దీనిపై నేచురల్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్..!
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్(sivakarthikeyan) హీరోగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai pallavi) హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ సినిమా ‘అమరన్’(Amaran). దీపావళి సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఇక విడుదల టైమ్ దగ్గర పడుతుండటంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్(Promotions) బిజీలో ఉన్నారు చిత్ర బృదం. ఈ మూవీ కేవలం తమిళ్(Tamil)లోనే కాకుండా తెలుగు(Telugu)లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సాయి పల్లవికి సంబంధించిన ఒక పాత వీడియోని తీసుకొని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్(Troll) చేస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో సాయి పల్లవి నటించిన విరాటపర్వం(Virata Parvam) సినిమా విడుదల సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాకిస్థాన్(Pakisthan)లో ఉన్నవారు భారత సైనికులను ఉగ్రవాదులుగా చూస్తారు అని అన్నారు. అలాగే హింస ఎప్పుడూ సరైనది కాదు.. అది ఎలాంటి సమస్యలను పరిష్కరించదన్నారు. దీంతో ఆమె ఇండియన్ ఆర్మీ(Indian Army)ని అవమానించిందని, ఆమెను బాయ్‌కాట్ చేయాలని ‘బాయ్ కాట్ సాయిపల్లవి’(#Boycott Sai Pallavi) అనే హ్యాష్ ట్యాగ్‌తో కొందరు నెట్టింట దుమారం రేపారు. ఇక ఎప్పుడో వచ్చిన ఈ వీడియోను ఇప్పుడు నెగిటివ్‌గా వైరల్ చెయ్యడంతో ఈ విషయంపై సాయి పల్లవి స్పందించింది.
తాజాగా ఆమె మాట్లాడుతూ.. "ఏ వర్గాన్ని అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు. ఇంటర్వ్యూలో కొంత భాగాన్ని మాత్రమే వైరల్ చేయడం చాలా బాధగా ఉంది" అని సాయిపల్లవి ఎమోషనల్ అయ్యారు. కాగా ‘కశ్మీర్ ఫైల్స్’(Kashmir Files) మూవీలో ఓ ముస్లిం డ్రైవర్‌ను కొట్టి చంపిన విషయాన్ని పోల్చి చెప్పడంతో నెటిజన్స్ మరింత ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారగా.. సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం ‘అమరన్’ సినిమాపై ప్రభావం పడేలా ఉందని బాధపడుతున్నారు.