ఒడెస్సా పోర్టుపై రష్యా క్షిపణి దాడులు

by Vinod kumar |
ఒడెస్సా పోర్టుపై రష్యా క్షిపణి దాడులు
X

కీవ్: ఓ వైపు బలగాల ఉపసంహరణ చేస్తూనే, ఉక్రెయిన్‌పై రష్యా దాడులను కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ దక్షిణ సీపోర్ట్ ప్రాంతం ఒడెస్సాపై రష్యా మిలటరీ మిసైల్స్‌తో దాడులు చేసినట్లు ఆదివారం స్థానిక అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఆయిల్ రిఫైనరీ ధ్వంసమైనట్లు చెప్పారు. క్లిష్టమైన మౌలిక సదుపాయాలు క్షిపణులచే దెబ్బతిన్నాయని, అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ఒడెస్సా సమీపంలోని ఆయిల్ రిఫైనరీ, మూడు ఇంధన నిల్వ కేంద్రాలను తమ సైనికులు ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.


ఈ కేంద్రాలు రష్యా మిలిటరీ వినియోగించుకుంటుందని తెలిపింది. కాగా, రెండు రోజుల క్రితం ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యా ఆయిల్ స్టోరేజ్ సెంటర్లపై రెండు హెలికాప్టర్లు దాడులు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మరియా పూల్ నుంచి పౌరుల తరలింపు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఐదు వారాలుగా రష్యా కొనసాగిస్తున్న ప్రత్యేక మిలిటరీ అపరేషన్‌ను ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు సోమవారం మరోమారు చర్చలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed