- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యుద్ధం మొదటి దశ ముగిసింది: రష్యా
కీవ్: ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభమై నెల రోజులు పూర్తయ్యాక రష్యా సైన్యం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ లో మొదటి దశ మిలటరీ ఆపరేషన్ పూర్తయినట్లు వెల్లడించింది. ఇప్పుడు తమ దృష్టి తూర్పు ఉక్రెయిన్ నుంచి డాన్ బాస్ ప్రాంతాన్ని విముక్తి చేయడం పైనే ఉందని పేర్కొంది. రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదులు ఇప్పుడు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ ప్రాంతంలో 93 శాతం, డొనెట్స్క్ ప్రాంతంలో 54% నియంత్రణలో ఉన్నారని తెలిపింది. అంతేకాకుండా అనుకున్న లక్ష్యాలను చేరేవరకు మిలటరీ ఆపరేషన్ కొనసాగుతుందని రష్యా మంత్రిత్వ శాఖ శుక్రవారం మరోసారి స్పష్టం చేసింది.
1,351 పౌరులు మరణించారు
ఉక్రెయిన్ సైనికుల దాడుల్లో మరణించిన వారి సంఖ్య పై రష్యా ప్రకటన చేసింది. ఇప్పటివరకు తమ పౌరులు 1,351 మంది మరణించినట్లు రష్యా మిలటరీ జనరల్ స్టాఫ్ తెలిపింది. సుమారు 3,800కు పైగా సైనికులు గాయపడ్డారని వెల్లడించింది. కాగా, మరోవైపు నాటో మాత్రం 7 వేల నుంచి 15 వేల మధ్యలో రష్యా సైనికులు మరణించినట్లు పేర్కొంది. అయితే దీనిపై రష్యా మాత్రం ఎలాంటి నిర్ధారణ ఇవ్వలేదు.
రష్యాతో కష్టంగా చర్చలు: ఉక్రెయిన్
రష్యాతో చర్చలు కష్టంగా జరుగుతున్నాయని ఉక్రెయిన్ తెలిపింది. అయితే ఎలాంటి డిమాండ్లకు తలొగ్గేది లేదని శుక్రవారం పేర్కొంది. రష్యాతో సంప్రదింపుల ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా తెలిపారు. ఉక్రెయిన్ బృందం ధృడంగా ఉందని, ఎలాంటి డిమాండ్లకు తగ్గదని చెప్పారు. తాము ఉక్రెయిన్ ప్రాంతీయ సమగ్రత కోసం భద్రతా గ్యారంటీ, కాల్పుల విరమణ చేపట్టాలని కోరుతున్నామన్నారు. రష్యాతో చర్చల్లో ఎలాంటి ఏకాభిప్రాయం లేదని తెలిపారు.