- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RRR ఈ దశాబ్దపు అతిపెద్ద డిజాస్టర్: కమల్ ఆర్ ఖాన్
దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన పాత్రల్లో.. దిగ్గజ టాలెంటెడ్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కన్న అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లు సాధిస్తూ.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. వారం రోజుల్లోనే 700కోట్లు సాధించిన ఈ చిత్రంపై.. బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆర్ఆర్ఆర్ సినిమాకు.. బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2లకు కలిపి పెట్టిన బడ్డెట్ కంటే రెండింతలు ఎక్కువ పెట్టారు. అయిన ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి వారం కలెక్షన్‌లు చూస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమా ఈ దశాబ్దపు డిజాస్టర్' అనిపిస్తోందని మరోసారి జక్కన్నపై, తెలుగు చిత్ర పరిశ్రమపై తన అక్కసు వెళ్లగక్కాడు.
అయితే, కమల్ ఆర్ ఖాన్ ఈ సినిమాపై విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. మార్చి 25వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో షోలు పడకముందే బెనిఫిట్ షో చూసి 'ఆర్ఆర్ఆర్ తలా తోకా లేని సౌత్ మసాలా సినిమా.. భారతీయ సినీ చర్రితలోనే ఆర్ఆర్ఆర్ అతి చెత్త సినిమా.. ఇదొక పెద్ద నేరం.. 600 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ఇటువంటి చెత్త సినిమా తీసిన రాజమౌళిని ఆరు నెలలు జైల్లో పెట్టాలని' వరుస ట్వీట్‌లతో తన అక్కసు వెళ్లగక్కారు.