- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఆర్ఆర్ఆర్' రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ మూవీ విడుదలకు ముందే సంచలనాలు సృష్టించింది అనడంలో అతిశయోక్తేమీ లేదు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు వారి కోరిక ఫలించింది. చెప్పినట్లుగానే మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా బాక్షాపీస్‌ను బద్దలు కొట్టింది. మొదటి షోతోనే ప్రేక్షకుల మతులు పోగొట్టింది. మూవీలో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్‌కు యావత్ ప్రపంచం దాసోహమైంది. ఇక రాజమౌళి టేకింగ్‌కి సినీ పరిశ్రమ మాటలు రాక మూగబోయింది. మూవీలో ప్రతి సీన్ ఓ ఆణిముత్యంలా ఉందంటూ ప్రేక్షకులు అంటుంటే.. ఈ సీన్‌లకు ఆణిముత్యాలే చిన్నబోతాయంటూ అభిమానులు కొనియాడుతున్నారు. 'బాహుబలి'తో ప్రపంచానికి తెలుగు సినిమాను పరిచయం చేస్తే.. 'ఆర్ఆర్ఆర్' ప్రపంచంలో తెలుగు సినిమాకు ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుస్తోంది. ఈ సినిమా ప్రపంచ రికార్డులను తిరగరాయడం పక్కా అంటూ ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఇంతకీ సినిమా ఎలా ఉందో మనమూ చూసేద్దాం..
కథ : కేవీ విజయేంద్ర ప్రసాద్
దర్శకుడు : ఎస్ ఎస్ రాజమౌళి
మ్యూజిక్ : ఎమ్ఎమ్ కీరవాణి
నిర్మాత : డీవీవీ దానయ్య
సినిమాటోగ్రఫీ: కేకే సెంథిల్ కుమార్
మాటలు: సాయి మాధవ్ బుర్రా
బడ్జెట్ : రూ.400 కోట్లు
నటీనటులు : రామ్ చరణ్, ఎన్‌టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్, ఒలివియా మొర్రిస్, రే స్టీవ్‌సన్, శ్రియ, రాహుల్ రామకృష్ణ తదితరులు.
కథ : సినిమా స్వాతంత్ర్యానికి ముందు 1920లో తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో కథ మొదలవుతుంది. బ్రిటీష్ పాలన సాగుతుండటంతో వారు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటారు. అదే సమయంలో గోండు తెగకు చెందిన మల్లి అనే అమ్మాయి గొంతు నచ్చడంతో ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కుని పోతారు. అందుకు అడ్డుపడిన అమ్మాయి తల్లిని సైనికులు చంపేస్తారు. ఆ అమ్మాయిని కాపాడేందుకు గోండు తెగ నాయకుడు కొమురం భీం వస్తాడు. అందులో భాగంగానే ఢిల్లీలోని బ్రిటీష్ ప్రభుత్వంపై తిరగబడి విధ్వంసం సృష్టిస్తాడు. దాంతో అతడిని ఎలాగైనా పట్టుకొని బంధించాలని బ్రిటీష్ ప్రభుత్వం భావిస్తుంది.
అందుకోసం రామరాజును స్పెషల్ ఆఫీసర్‌గా నియమిస్తోంది. రామరాజు బ్రిటీష్ పాలనలో పోలీసు అధికారిగా పనిచేస్తుంటాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా గొప్ప కీర్తి అందుకుంటాడు రామరాజు. అయితే అంతకుముందే భీం, రామరాజు కలుసుకుంటారు. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అప్పుడే జెన్నీ (ఓలీవియా)కు దగ్గరయ్యేందుకు భీంకు రామరాజు సహాయం చేస్తాడు. కానీ ఆ తర్వాత భీం బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని తెలిస్తుంది. దాంతో వీరిద్దరు విడిపోతారు. అనంతరం ఒకరితో ఒకరు పోరాడేందుకు సిద్ధం అవుతారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది.
ఆ తర్వాత భీంను రామరాజు బ్రిటీష్ వారికి అప్పగించారా లేదా అనేది బిగ్ స్క్రీన్‌పైనే చూడాలి. అంతేకాదు భీం అక్తర్‌గా ఎందుకు మారాడు, పోలీస్‌గా ఉన్న రామరాజు బ్రిటిష్ వారితో ఎందుకు యుద్ధం చేశాడు. ఒలీవియా, సీత పాత్రలేంటి ఇలా అనేక ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నింటికి సమాధానం కావాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే. ఇంట్రవెల్ సీన్ చూస్తే గూస్‌బమ్స్ రావడం పక్కా. ఆ తర్వాత అజయ్ దేవగన్ ఫ్లాష్ బ్యాక్ కూడా అదిరిపోయింది. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ను వివరించడం కష్టం. బిగ్ స్క్రీన్‌పై చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది.
ఇక ఈ సినిమాలో బ్రిటీష్ ప్రభుత్వంపై భీం చేసే యుద్ధం ప్రేక్షకులందరినీ సీట్ అంచులకు లాగుతుంది. యాక్షన్ సీన్స్‌కు ప్రతి ఒక్కరు నోరెళ్ల బెడతారు. రామ్, భీమ్ మధ్య స్నేహం కూడా అద్బుతంగా చూపించారు. ఇందులో యాక్షన్, ఎమోషన్ ఇలా ప్రతి ఎలిమెంట్ పుష్కలంగా ఉంది. ఇందులో బ్రిటీషర్స్‌తో రామ రాజు ఫైట్ కానీ, భీం ఫైట్ కానీ నెవ్వర్ బిఫోర్ ఫీల్ కలిగిస్తున్నాయి. ఇక రామ్ చరణ్, ఎన్‌టీఆర్ నటన విషయానికొస్తే.. వీరిద్దరు తమ పాత్రలకు పూర్తి స్థాయి న్యాయం చేశారు. రామ రాజు, కొమురం భీం అంటే రామ్ చరణ్, ఎన్‌టీఆర్ అంతే అన్నట్లుగా నటించారు. అదే విధంగా అజయ్ దేవగన్, శ్రియ కూడా అద్భుతమైన నటన కనబరిచారు. సినిమాలో ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
'ఆర్ఆర్ఆర్' మూవీలోని ప్రతి సీన్ కూడా అభిమానులకు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రతి నటుడు ప్రతి సీన్‌ను ప్రాణం పెట్టి నటించారు. ఈ సినిమాతో రాజమౌళి మరోసారి తను మాస్టర్ స్టోరీ టెల్లర్ అని నిరూపించుకున్నాడు. ఈ మూవీలో ప్రతి పాట కూడా సిచ్యుయేషన్‌కు సరిగ్గా సరిపోతోంది. ఏ సీన్ కూడా ఎక్స్‌ట్రా అనిపించదు. ఓవర్ ఆల్‌గా సినిమా విజువల్ వండర్ అన్న పదానికి సరిగ్గా సూట్ అవుతుంది. ఎంఎం కీరవాణి మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. ప్రతి పాటకు అదిరిపోయే సంగీతాన్ని అందించారు.
రివ్యూ: సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ రొటీన్‌గానే ఉన్నప్పటికీ విజువల్స్ అదిరిపోయాయి. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సూపర్.
- Tags
- RRR
- RRR REVIEW