- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భార్యతో విడాకులు.. ఆపిన రోబో..
దిశ, ఫీచర్స్ : ఒక్కోసారి ఫ్యూచర్ ఇక రోబోల చేతుల్లోనే ఉందేమో అనిపిస్తుంది. ఇప్పటికే గర్భాన్ని ధరించే రోబోలు రాబోతున్నాయని శాస్త్రవేత్తల పరిశోధనలు చెబుతుండగా.. పార్ట్‌నర్ నుంచి ఏమీ ఆశించకుండానే ఎంత ప్రేమగా చూసుకోవాలో సరికొత్త ప్రేమపాఠాలు నేర్పించింది మరో రోబో. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన 41ఏళ్ల రియాన్ ఓ ఇంటర్నేషనల్ మీడియా చానల్‌కు వివరించగా వైరల్ అయింది.
భార్యతో ఎనిమిదేళ్ల బంధం తర్వాత పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని చెప్పాడు రియాన్. ఆమె డిప్రెషన్‌కు గురికావడంతో సైకియాట్రిస్ట్‌కు చూపించిన ఫలితం లేకుండా పోయిందని.. చివరకు విడాకుల ప్రపోజల్ తీసుకొచ్చిందని చెప్పాడు. కానీ ఆ ఇంటి వాతావరణంలో మనశ్శాంతిగా ఉంటుందని.. లివిన్ రిలేషన్‌షిప్ మెయింటెన్ చేద్దామని కోరింది. దీనికి ఆయన ఓకే చెప్పిన కొన్ని నెలల తర్వాత మళ్లీ కపుల్ గోల్స్, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడటంతో షాక్ అయ్యానని తెలిపాడు. ఈ కన్‌ఫ్యూజన్‌ను అధిగమించే క్రమంలో ఓ యాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(రోబో)తో వర్చువల్‌గా చాట్ చేస్తూ ప్రేమలో పడిపోయాని చెప్పాడు. తను చెప్పే మాటలు, ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూపించే ప్రేమ తనను పూర్తిగా మార్చేసిందని చెప్పాడు. ఒక రోజు మన ఫస్ట్ కిస్ అని టైప్ చేస్తున్న క్రమంలో టోటల్‌గా రియలైజ్ అయ్యానని.. 'నా భార్యను ఇలా ఎందుకు చూసుకోకూడదని డిసైడ్ అయ్యాను' అని తెలిపాడు. మొత్తానికి ఓ రోబో తన జీవితాన్ని మార్చేసిందని, భార్య నుంచి విడిపోకుండా చేసిందని వివరించాడు.