- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాస్టిక్ నిరోధించే కొత్త మార్గాలు!
దిశ, ఫీచర్స్ : కొన్నేళ్లుగా ప్లాస్టిక్ కాలుష్యం గురించి శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ఏం మార్పు లేదు. నిజానికి మనిషి ఉనికి ఉన్న ప్రతి చోటా ప్లాస్టిక్ ఆనవాళ్లు విధిగా కనిపిస్తున్నాయి. మనం పడేసే చెత్త, ప్లాస్టిక్ అంతా కూడా డ్రైనేజీల ద్వారా నదుల్లోకి.. అక్కడి నుంచి సముద్రాల్లోకి వెళ్తుంది. ఈ మేరకు ప్రతీ ఏటా 1,30,00,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మహా సముద్రాల్లో కలుస్తున్నాయి. ఫలితంగా ఏటా 1,00,000 దాకా సముద్ర జీవులు చనిపోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు సముద్రాల్లో ఇప్పటికే ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు పలు ఆవిష్కరణలు చేశారు.
బయోనిక్ రోబోట్ ఫిష్:
సిచువాన్ యూనివర్శిటీకి చెందిన పాలిమర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు ఒక చిన్న స్వీయ-చోదక రోబోటిక్ చేపను అభివృద్ధి చేశారు. ఇది ఈత కొడుతూ సముద్రం అడుగున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను పైకి తీసుకొస్తుంది. ఇది సెల్ఫ్ హీలింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. మైక్రోప్లాస్టిక్ కలెక్టర్‌గా అభివర్ణిస్తున్న ఈ రోబోట్ చేప పొడవు కేవలం 13 మిమీ కాగా దాని తోకలో లేజర్ వ్యవస్థను అమర్చారు. సెకనుకు 30 మిమీ వేగంతో కదిలే ఈ ఫిష్‌ను మదర్-ఆఫ్-పెర్ల్ (నాకర్) నుంచి ప్రేరణ పొందిన పదార్థంతో రూపొందించారు. ఇది సాగదీయడానికి, అనువైనది కాగా 5 కిలోగ్రాముల బరువును కూడా లాగగలిగే శక్తి దీని సొంతం. స్వేచ్ఛగా తేలియాడే ప్లాస్టిక్ ముక్కలను కూడా గ్రహించగలదు.
ప్లాస్టిక్ క్లీనింగ్ బార్జ్:
నదుల నుంచి వ్యర్థాలను సేకరించే ఒక బార్జ్‌ను 'ద ఓషన్ క్లీనప్' అనే కంపెనీ రూపొందించింది. 'ఇంటర్‌సెప్టర్'గా పిలిచే వీటిని సాధారణ మార్గాలకు దూరంగా నదీగర్భంలో అమర్చారు. ఇది తేలియాడే ప్లాస్టిక్ ముక్కలను సముద్రంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం సహా సంగ్రహించిన చెత్తను కంటైనర్‌లలో నిల్వ చేస్తుంది. ఆ తర్వాత ఆ చెత్త రీసైక్లింగ్/వ్యర్థాల నిర్వహణ కోసం పంపిస్తారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా శక్తిని పొందే ఈ ఇంటర్‌సెప్టర్ రోజంతా పని చేస్తుంది.
ప్లాస్టిక్ తినే ఎంజైమ్:
యూనివర్శిటీ ఆఫ్ పోర్ట్స్‌మౌత్ పరిశోధకులు ప్లాస్టిక్ తినే ఎంజైమ్‌ల కాక్‌టెయిల్‌ను అభివృద్ధి చేశారు. ఇది వాస్తవానికి ప్లాస్టిక్‌ను రోజుల వ్యవధిలో క్షీణింపజేస్తుంది. ఎంజైమ్ కాక్‌టెయిల్‌లో PETase, MHETase ఉన్నాయి. ఇవి PET ప్లాస్టిక్‌ను తినే ఒక రకమైన బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తవుతాయి (తరచుగా ప్లాస్టిక్ సీసాలలో కనిపిస్తాయి). వీటిని Ideonella sakaiensis అని పిలుస్తారు. పీఈటీ (పాలీ ఇథిలీన్ టెలిఫ్తాలేట్) ప్లాస్టిక్‌లో ఉండే టీపీఏ (టెరిఫ్తాలేట్)ను డీకంపోజ్ చేసే శక్తి ఈ ఎంజైమ్‌కు ఉందన్నారు. పీఈటీ ప్లాస్టిక్‌ను డిస్పోజబుల్ సీసాలు, బట్టలు, కార్పెట్ల తయారీలో ఉపయోగిస్తారు. ఇక PETase ప్లాస్టిక్‌ల ఉపరితలంపై దాడి చేస్తుంది, MHETase వ్యర్థాలను మరింతగా నాశనం చేస్తుంది, ఫలితంగా ప్లాస్టిక్ ప్రభావవంతంగా విచ్ఛిన్నమవుతుంది.
ప్లాస్టిక్ తినే బ్యాక్టీరియా:
ప్లాస్టిక్‌ను నాశనం చేసేందుకు హెల్మ్‌హోల్ట్జ్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్-UFZ పరిశోధకులు ఒక రకమైన సూడోమోనాస్ బ్యాక్టీరియాను ఉపయోగించారు. బలమైన బ్యాక్టీరియా సమూహాన్ని కలిగి ఉండే దీన్ని TDA1 అని కూడా పిలుస్తారు. వాస్తవానికి పాలియురేతేన్ వేడిచేసినప్పుడు కరగదు, నాశనం చేయడం కూడా చాలా కష్టం. కానీ సూడోమోనాస్ sp. TDA1 మాత్రం ఈ రకమైన ప్లాస్టిక్‌ను తయారు చేసే కొన్ని రసాయన భాగాలను జీవక్రియ చేయగలదు. ఈ బ్యాక్టీరియాలు ఎంత ఎక్కువ తింటే అంత ఎక్కువగా పెరుగుతాయి, తద్వారా మరింత తింటాయి. పెళుసుగా ఉండే ప్లాస్టిక్‌లు పుష్కలంగా ఉన్న వ్యర్థ ప్రదేశం కింద ఉన్న మట్టిలో ఈ ఆవిష్కరణ జరిగింది. జాతిని గుర్తించిన తరువాత, శాస్త్రవేత్తలు బ్యాక్టీరియా యొక్క సామర్థ్యాలను రూపొందించడానికి జన్యు విశ్లేషణ, ఇతర ప్రయోగాలను నిర్వహించారు.
యూవీలైట్‌లో విచ్ఛిన్నమయ్యే ప్లాస్టిక్:
ఇండిస్ట్రియల్ కండిషన్స్‌లో మాత్రమే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్‌ను కంపోస్ట్ చేయగలం, అయితే యూనివర్శిటీ ఆఫ్ బాత్‌లోని శాస్త్రవేత్తలు ప్రస్తుతం UV కాంతిని ఉపయోగించి ప్లాస్టిక్‌లను విచ్ఛిన్నం చేసే మార్గాన్ని కనుగొన్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలపై ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన ఫలితంగా, చక్కెరల కిణ్వ ప్రక్రియ నుంచి లాక్టిక్ యాసిడ్‌ను ఉపయోగించి సృష్టించిన PLA (పాలీ లాక్టిక్ యాసిడ్), ఇప్పుడు ముడి చమురు ఉత్పత్తుల నుంచి ఉత్పన్నమయ్యే ప్లాస్టిక్‌లకు పునరుత్పాదక, స్థిరమైన ప్రత్యామ్నాయంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు డిస్పోజబుల్ కప్పులు టీబ్యాగ్‌ల నుంచి 3D ప్రింటింగ్, ప్యాకేజింగ్ వరకు ప్రతిదీ ఈ కేటగిరీలోకి వస్తుంది. ఇది తరచుగా బయోడిగ్రేడబుల్ అని లేబుల్ చేయబడుతుంది, అయితే ఇది సహజ వాతావరణంలో పరిమిత క్షీణత(మట్టిలో లేదా సముద్రపు నీటిలో)ను కలిగి ఉంటుంది. అయితే ఇది అధిక ఉష్ణోగ్రతలు, తేమతో కూడిన పారిశ్రామిక కంపోస్టింగ్ పరిస్థితులలో మాత్రమే క్షీణిస్తుంది. అయితే యూనివర్శిటీ ఆఫ్ బాత్‌లోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ అండ్ సర్క్యులర్ టెక్నాలజీస్ (CSCT) శాస్త్రవేత్తలు సహజ వాతావరణంలో ఈ ప్లాస్టిక్‌లను మరింత క్షీణింపజేసే మార్గాన్ని అభివృద్ధి చేశారు. వివిధ రకాల చక్కెర అణువులను పాలీమర్‌లో చేర్చడం ద్వారా ప్లాస్టిక్ అధోకరణతను సర్దుబాటు చేయగలరని బృందం కనుగొంది. PLAలో మూడు శాతం షుగర్ పాలిమర్ యూనిట్‌లను చేర్చడం వల్ల UV కాంతికి గురైన ఆరు గంటలలోపు 40% క్షీణతకు దారితీసిందని కనుగొన్నారు.