బైక్‌ను ఢీకొట్టిన బొలేరో వాహనం.. ఇద్దరు మృతి

by Vinod kumar |   ( Updated:2022-03-15 14:35:59.0  )
బైక్‌ను ఢీకొట్టిన బొలేరో వాహనం.. ఇద్దరు మృతి
X

దిశ, పరిగి: మేడి కొండ నుంచి మన్నెగూడ వైపునకు వస్తున్న బైక్‌ను బొలేరో వాహనం వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చన్గొముల్​ఎస్ఐ రాసుల శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడికొండ గ్రామానికి చెందిన చాకలి రవీందర్(28), యాదిరెడ్డి (50 ) అను ఇద్దరు మోటార్ సైకిల్​పై మంగళవారం ఉదయం మన్నెగూడ వైపునకు వస్తున్నారు. హైదరాబాద్​–బీజాపూర్​జాతీయ రహదారి 163 పై చీలాపూర్ గేట్ సమీపంలో ఎదురుగా వేగంగా వస్తున్న బొలేరో వాహనం ఢీ కొట్టింది.


ఈ ప్రమాదంలో చాకలి రవీందర్, యాదిరెడ్డి లు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పరిగి డీఎస్పీ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. బొలేరో వాహనం డ్రైవర్​అక్బర్​పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షి గొంగుపల్లి గ్రామస్తుడు ఖదీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాసుల శ్రీశైలం తెలిపారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story