- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆటోను ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం
by Vinod kumar |
X
దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు-ఆటో ఢీ కొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. యాక్సిడెంట్‌పై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఆటోలో మిర్చి కోతకు వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఆటోలో ప్రయాణిస్తుున్న ఇద్దరు, కారులో ఉన్న ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. చనిపోయిన వారిని మొగుళ్లపల్లి కి చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
Advertisement
Next Story