- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పశ్చిమ బెంగాల్‌లో కల్లోలం.. ఎన్‌హెచ్ 116 బి పై ఘోర రోడ్డుప్రమాదం
ఈస్ట్ మిడ్నాపూర్ : పశ్చిమ బెంగాల్ లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మూక పోలీస్ వాహనానికి నిప్పు పెట్టగా, ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ అమర్ నాథ్ కథనం ప్రకారం.. జాతీయ రహదారి 116 బి పై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటాయ్ నుంచి నందకుమార్ వైపు వెళ్తున్న ఇసుక ట్రక్కు పోలీసు వాహనాన్ని గమనించి సడన్ బ్రేక్ వేయగా.. కాంటాయ్ నుంచి హౌరా ప్యాసింజర్ బస్ వెనకే వేగంగా వస్తోంది. ట్రక్ డ్రైవర్ ఆపేందుకు ప్రయత్నించగా వెనకే వస్తున్న బస్సు డ్రైవర్‌కు వాహనం కంట్రోల్ అవ్వలేదు. దీంతో ట్రక్‌ను ఢీకొని ఆ తర్వాత ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో కొందరు రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని నిరసన చేపట్టగా ఈస్ట్ మిడ్నాపూర్ పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో ఆగ్రహించిన బాధిత కుటుంబీకులు, ప్రజలు గందరగోళం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ఓ గుంపు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు నిప్పుపెట్టారు. కాగా, ఈ దుశ్చర్యకు పాల్పడిన గుంపులో ప్రధాన నిందితులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.