‘రివాల్వర్ రీటా’ టైటిల్ టీజర్ రిలీజ్.. మాస్ అవతార్‌లో స్టార్ హీరోయిన్ లుక్ అదుర్స్

by Hamsa |   ( Updated:2024-10-18 14:25:50.0  )
‘రివాల్వర్ రీటా’ టైటిల్ టీజర్ రిలీజ్.. మాస్ అవతార్‌లో  స్టార్ హీరోయిన్ లుక్ అదుర్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) ‘మహానటి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. అంతేకాకుండా నేషనల్ అవార్డును కూడా అందుకుని ఫుల్ క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. అయితే ఈ అమ్మడు యంగ్ హీరోలతో పాటు స్టార్స్ సరసన కూడా నటించి యూత్‌ను మంత్రముగ్దులను చేసింది. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఇటీవల ‘రఘు తాత’ (Raghu Thatha)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రజెంట్ కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘రివాల్వర్ రీటా’(Revolver Rita). ఇందులో రాధిక శరత్‌కుమార్(Radhika Sarathkumar), సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ, సూపర్ సుబ్బరాయన్, జాన్ విజయ్(John Vijay) కీలక పాత్రలో కనిపించనున్నారు. JK చండూరు (JK Chandur)దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియో నిర్మించింది. కీర్తి సురేష్(Keerthy Suresh) ఈ చిత్రంలో పోలీస్ అధికారిణిగా నటిస్తున్న సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘రివాల్వర్ రిటా’(Revolver Rita) టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కీర్తి సురేష్ మాస్ అవతార్‌లో కనిపించింది. ఇక ఈ టైటిల్ టీజర్ అదిరిపోయింది. దీనిని చూసిన మహానటి అభిమానులు ఆనందపడుతున్నారు.



Advertisement

Next Story