- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ పదవి నుంచి చిన్న జీయర్‌ను తొలగించండి: రేవంత్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరపై చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే గిరిజన సంఘాలు, రాజకీయ ప్రముఖులు దీనిపై స్పందించి చిన్న జీయర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయంపై సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునర్:నిర్మిస్తున్న యాదాద్రి ఆలయానికి సంబంధించి పూర్తి బాధ్యతలు చిన్న జీయర్ స్వామి చూస్తు్న్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన "సమ్మక్క సారలమ్మ"లను అవమానపరిచిన చినజీయర్‌ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తక్షణమే కేసీఆర్ తొలగించి...మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.
తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన "సమ్మక్క సారలమ్మ"లను అవమానపరిచిన త్రిదండి చినజీయర్‌ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తక్షణమే కేసీఆర్ తొలగించి...మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.@TelanganaCMO pic.twitter.com/xCqh4jRyE5
— Revanth Reddy (@revanth_anumula) March 18, 2022