గుడ్ న్యూస్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసినట్లే..!

by Satheesh |   ( Updated:2022-03-29 13:19:52.0  )
గుడ్ న్యూస్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసినట్లే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం గత కొన్ని రోజులుగా నిర్విరామంగా జరుగుతోంది.ఈ క్రమంలో మరో ప్రపంచ యుద్ధం తప్పదని వచ్చిన హెచ్చరికలతో ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో యుద్ధం ముగించే దిశగా ఇరు దేశాల చర్చలు సాగాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నిలిపివేసేందుకు ఇరు దేశాల ప్రతినిధులు టర్కీలోని ఇస్తాంబుల్‌లో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా.. రాజధాని కీవ్ సహా మరో ప్రధాన నగరమైన చెర్నిహివ్​నుంచి సైన్యం ఉపసంహరణకు రష్యా అంగీకరించింది. ఉక్రెయిన్‌కు మరింత భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ వెల్లడించారు.

Advertisement

Next Story