- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా..
దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని ఎస్.వి. జూనియర్ కళాశాలలో ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి.రామకృష్ణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఉద్యోగాలకు 2021 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, తెలుగు భాషపై పట్టు ఉండి, ఇంగ్లీష్ భాషపై ప్రాథమిక అవగాహన కలిగి ఉన్న వారు అర్హులని తెలిపారు.
18 - 20 మధ్య వయస్సు గల విద్యార్థులను రాత పరీక్ష ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసుకొని డా. రెడ్డీస్ లాబొరేటరీస్ వారు బిట్స్ పిలాని హైదరాబాద్‌లో డిగ్రీ చదివిస్తూ (ఫార్మక్యూటికల్ కెమిస్ట్రీ), ఉద్యోగ అవకాశం కల్పిస్తుందని, తగిన వేతనం కూడ ఇస్తుందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్మీడియట్ మెమోలతో పాటు ఆధార్ కార్డు పత్రాలతో, ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9849477450, 9290434597, 8096454622, 9440362346 మొబైల్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.