- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దక్షిణ మధ్య రైల్వేకు రికార్టు లాభాలు.. పార్సిల్ సర్వీస్‌తో రూ.వందల కోట్ల ఆదాయం
దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక పార్సిల్ ఆదాయం అర్జించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిశోర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా (టారిఫ్, నాన్ టారిఫ్ రాయితీలతో సహా) ప్రవేశపెట్టబడిన వినూత్న విధానాలతో పాటు జోన్‌లో సజావుగా నిత్యావసరాల వస్తువుల సరఫరా జరగడానికి కేంద్రీకృత విధానాలను పటిష్టంగా అమలుచేసిన ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ రంగంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా రూ.200 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. 2020-21 సంవత్సరంలో పార్సిల్‌లో వార్షిక ఆదాయం మొత్తం రూ.108.3 కోట్లు కాగా కొవిడ్ 19 కారణంగా అనేక సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ప్రస్తుత 2021-2022 ఆర్థిక సంవత్సరంలో (2022 మార్చి 19వ తేదీ వరకు) పార్సిల్స్‌లో 4.78 లక్షల టన్నుల లోడింగ్‌ను నిర్వహించి రూ.200 కోట్ల ఆదాయాన్ని జోన్ సాధించినట్లు పేర్కొన్నారు.
జోన్ 473 కిసాన్ ప్రత్యేక రైళ్ల ద్వారా 1.57 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసిందని, వీటితో రూ.72.67 కోట్ల ఆదాయాన్ని పొందినట్లు తెలిపారు. 'దూద్ దురంతో' కొవిడ్ లాక్ డౌన్ సమయంలో దేశ రాజధానికి పాలను వినూత్న పద్ధతిలో సరఫరా చేయడం ప్రారంభించిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 7.22 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేయడంతో రూ.34.03 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడంలో తోడ్పడినట్లు తెలిపారు. వీటికి అదనంగా, నాన్ లీజ్డ్ ట్రాఫిక్ నుండి రూ.73.62 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ పార్సిల్స్ రవాణాలో సాధారణ ప్రయాణికుల రైళ్లు, పార్సిల్ ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయని అంతేకాక, 62 ఎస్‌ఎల్‌ఆర్‌లు, 5 పార్సిల్ వ్యాన్లలో పార్సిల్ స్పేస్ లీజింగ్ ద్వారా రూ 20.08 కోట్ల ఆదాయం సాధించిందన్నారు. మెరుగైన పార్సిల్ ఆదాయాన్ని సాధించడంలో కృషి చేసిన జోనల్, డివిజినల్ ఆపరేటింగ్, కమర్షియల్ విభాగాల బృందాలను అభినందించారు. చిన్న, మధ్య తరహా సరుకులను దేశం నలుమూలలకు రవాణా చేయడంలో ఉత్పత్తిదారులకు సహాయ సహకారాలను అందిస్తూ ఇదే పనితీరును ఇక మీదట కూడా కొనసాగించాలని ఆయన ఈ బృందాలకు సూచించారు.