- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RBI కీలక నిర్ణయం.. ATM కార్డు లేకుండానే మనీ విత్‌డ్రా!!
దిశ, వెబ్‌డెస్క్: మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టడానికి ఇండియాలోని అన్ని బ్యాంకులు, ATMలలో కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని RBI ప్రతిపాదించినట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. UPIని ఉపయోగించి అన్ని బ్యాంకులు, ATM నెట్‌వర్క్‌లలో ఈ సదుపాయాన్ని తీసుకురానున్నారు. ప్రస్తుతం ఏటీఎం ద్వారా కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ కొన్ని బ్యాంకులకు మాత్రమే పరిమితం చేశారు. కానీ ఇప్పుడు వినియోగదారుల సౌకర్యం కోసం కొత్తగా UPI ని ప్రవేశపెట్టి అన్ని బ్యాంకులు, ATMలలో నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించనున్నారు. ఏదైనా బ్యాంకు, ఏటీఎం వద్ద ఎలాంటి కార్డు లేకుండానే ఏకీకృత చెల్లింపుల ఇంటర్‌ఫేస్(UPI)ని ఉపయోగించి నగదు విత్‌డ్రా చేయవచ్చు. ఎలాంటి భౌతిక కార్డులు అవసరం లేకుండా, సురక్షితమైన డిజిటల్ లావాదేవీలు చేయడానికి, మోసపూరిత లావాదేవీలను నిరోధించడానికి ఈ సదుపాయం ఉపయోగపడుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
ఇవి కూడా చదవండి : గిన్నీస్ వరల్డ్ రికార్డు: మబ్బులను దాటి.. ఒట్టికాళ్లతోనే నడిచాడు! (వీడియో)