రామారావు ఆన్ డ్యూటీ ఫస్ట్ డే కలెక్షన్స్..

by sudharani |   ( Updated:2022-07-30 09:14:56.0  )
రామారావు ఆన్ డ్యూటీ ఫస్ట్ డే కలెక్షన్స్..
X

దిశ, సినిమా : ర‌వితేజ హీరోగా శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శక‌త్వంలో రూపొందిన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం శుక్రవారం విడుదలైంది. ఓ మిస్సింగ్ కేసును డిప్యూటీ క‌లెక్టర్ ఎలా సాల్వ్ చేశాడనేదే సినిమా కథ కాగా.. తొలిరోజు యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది. కథ చాలా రొటీన్‌గా ఉందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 4.75 కోట్ల గ్రాస్‌ మాత్రమే రాబ‌ట్టినట్లు సమాచారం. నైజాంలో రూ. 85 ల‌క్షలు, ఉత్తరాంధ్రలో రూ. 45 ల‌క్షలు, సీడెడ్‌లో రూ. 52 ల‌క్షలు, గుంటూర్ రూ. 24 లక్షలు, నెల్లూర్‌లో రూ. 12 ల‌క్షలు కలెక్ట్ చేసింది. మొత్తంగా ఏపీ, తెలంగాణ‌లో కలిపి రూ. 2.82 ల‌క్షల షేర్ మాత్రమే సాధించి నిర్మాత‌లకు గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఇంకా ప‌న్నెండు కోట్లకు పైగా వ‌సూళ్లు రాబడితే తప్ప సినిమా సేఫ్ జోన్‌కు వెళ్లదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ స్థాయి వ‌సూళ్లను సాధిస్తుందో లేదో కొంచెం అనుమానమే.

Advertisement

Next Story

Most Viewed