ఫ్యాన్స్‌కు రష్మిక క్విజ్.. గెస్ చేయండంటూ..

by Javid Pasha |   ( Updated:2022-03-08 02:30:48.0  )
ఫ్యాన్స్‌కు రష్మిక క్విజ్.. గెస్ చేయండంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన తన అభిమానులకు క్విజ్ పెట్టింది. 'నేను ఎవరితో కలిసి షూట్ చేస్తున్నానో గెస్ చేయండి' అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అయితే ఇప్పటికే తన అందం, అభినయంతో దక్షిణాదితో పాటు ఉత్తరాదినీ బుట్టిలో వేసుకుందీ ముద్దుగుమ్మ. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం అమ్మడు తెలుగు, హిందీ, తమిళ్ మరిన్ని భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే అమ్మడు తన ఇన్‌స్టా స్టోరీల్లో షేర్ చేసిన బాలీవుడ్ నటుడు ఎవరో కాదు. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్. 'వర్కౌట్స్ నుంచి షూటింగ్ వరకు' అంటూ వీరిద్దరి ఫోటోను రివీల్ చేసింది. మరి వీరిద్దరు కలిసి షూట్ చేస్తోంది దేనికో తెలీదు. అది సినిమానా, వెబ్‌ సీరిసా, టీవీ యాడా అన్నది మాత్రం ఇంకా తెలీదు. అది తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.



Advertisement

Next Story