'ఇంతకంటే బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది': రష్మిక మందన్నా

by Satheesh |
ఇంతకంటే బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది: రష్మిక మందన్నా
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస సినిమాలతో దూసుకుపోతున్న హాట్ బ్యూటీ రష్మిక మందన్నా నేడు 26వ వసంతంలోకి అడుగుపెట్టింది. అగ్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న ఈ కన్నడ భామ.. స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక.. బాలీవుడ్‌లో సైతం పాగ వేసింది. అయితే, తాజాగా శ్రీవల్లీ.. ట్వీట్టర్‌లో అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నాను ఎంపిక చేసినట్లు మూవీ యూనిట్ ఇవాళ తెలిపింది. బర్త్ డే రోజే గుడ్ న్యూస్ చెప్పిన చిత్ర బృందానికి థ్సాంక్స్ చెప్పిన ఈ హాట్ బ్యూటీ.. 'ఇంతకంటే బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది' అంటూ సంతోషం వ్యక్తం చేసింది. అందం, అభినయం, క్యూట్ నెస్, హాట్ నెస్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ అందాల భామ.. అభిమానులకు నేషనల్ క్రష్‌గా మారింది.

Advertisement

Next Story