Rashi Khanna: డేట్​కు వెళ్లాలని ఉంది.. చైతు ముందు ఓపెనైన రాశీఖన్నా

by Manoj |   ( Updated:2022-07-09 10:50:59.0  )
Rashi Khanna Opens Up On Her Dating Secret in Thank You movie Promotions
X

దిశ, వెబ్‌డెస్క్: Rashi Khanna Opens Up On Her Dating Secret in Thank You movie Promotions| నాగచైతన్య, రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన సినిమా 'థ్యాంక్యూ'. జులై 22 న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్ర యూనిట్​. ఈ క్రమంలో రాశీఖన్నా ఓ చిట్ చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికీ తాను సింగిల్ అని చాలా సార్లు హింట్ ఇచ్చిన రాశీ.. తాజాగా తనకు డాక్టర్‌తో డేట్‌కు వెళ్లాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టింది. అదే సమయంలో పక్కనే ఉన్న చైతు ఫన్నీగా స్పందిస్తూ డాక్టర్లందరూ విన్నారుగా.. ఇక నుంచి డాక్టర్లు అందరూ ఆసుపత్రులకు వెళ్లడం మానేసి రాశీఖన్నా ఇంటి బయట కాపు కాస్తారేమో అంటూ ఆటపట్టించాడు.

అయితే.. రాశీతో రెండు సినిమాలు చేసిన చైతు.. ఆమె గురించి నాకు అంతా తెలుసు అంటూ ఓపెన్ అయ్యాడు. సెట్స్‌లో రాశీ ఎక్కువగా మాట్లాడుతూ, చాలా చలాకీగా ఉంటుంది. షూట్ జరుగుతున్న సమయంలో ఏ మాత్రం విరామం దొరికినా మేమిద్దరం చాలా విషయాలు పంచుకుంటూ ఉంటాం అని చెప్పాడు చైతన్య. ఇక కెరీర్ గురించి చాలా విషయాలు చర్చించుకుంటాం అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed