ఆయిల్ ఇండియా ఛైర్మన్‌గా రంజిత్ రథ్ నియామకం!

by Vinod kumar |
ఆయిల్ ఇండియా ఛైర్మన్‌గా రంజిత్ రథ్ నియామకం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్ ఇండియా ఛైర్మన్‌గా రంజిత్ రథ్‌ను నియమిస్తూ ప్రభుత్వ సంస్థ ఎంపిక కమిటీ(పీఈఎస్‌బీ) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన మినరల్ ఎక్స్‌ఫ్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్, ఎండీగా ఉన్నారు. ఆయిల్ ఇండియా చైర్మన్, ఎండీ ఉన్న సుశీల్ చంద్ర మిశ్రా ఈ ఏడాది జూన్ 30న పదవీ విరమణ కానున్నారు. సంస్థ బోర్డులో ఇద్దరు డైరెక్టర్లు, కంపెనీకి చెందిన మరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంటే ముందు ఛైర్మన్, ఎండీ పదవులకు రంజిత్ రథ్‌ను ప్రభుత్వం ఎంపిక చేయడం గమనార్హం.


2018 నుంచి గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రన ఎంఈసీఎల్‌లో బాధ్యతలు నిర్వహించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ నుంచి క్లియరెన్స్ లభించిన వెంటనే రంజిత్ రథ్ పేరును ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని అపాయింట్‌మెంట్స్ కమిటీకి పంపిస్తారు. రంజిత్ రథ్ ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివారు. ఎంఈసీఎల్‌లో పని చేయాడనికంటే ముందు ఇడినీర్స్ ఇండియా లిమిటెడ్ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు.

Advertisement

Next Story

Most Viewed