ఇదిగో మా లవ్‌ పోస్టర్‌.. 'బ్రహ్మాస్త్ర' నుంచి బిగ్ అప్‌డేట్

by samatah |   ( Updated:2023-08-11 09:23:56.0  )
ఇదిగో మా లవ్‌ పోస్టర్‌.. బ్రహ్మాస్త్ర నుంచి బిగ్ అప్‌డేట్
X

దిశ, సినిమా :బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటిస్తున్న తొలి చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కాశీలో పూర్తి చేసుకున్నట్లు తెలిపిన మేకర్స్.. తాజాగా మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. రణ్‌బీర్‌, ఆలియా ఇంటిమేట్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. కాగా డైరెక్టర్ అయాన్‌ ముఖర్జీ తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో ఈ పోస్టర్‌ షేర్‌ చేస్తూ.. 'ప్రేమంటే కాంతి. మనం చాలా కాలంగా 'బ్రహ్మాస్త్ర'లోని మొదటి అధ్యాయాన్ని 'పార్ట్‌ 1 : శివ' అని పిలుస్తున్నాం. కానీ పార్ట్‌ 1 అంటే ప్రేమ. బ్రహ్మాస్త్ర ప్రధానాంశం కూడా ప్రేమకున్న శక్తి గురించే. ఈ ప్రేమ అగ్నిలా అన్నివైపులా వ్యాపించి, సినిమాను దాటి నిజ జీవితంలోకి అడుగుపెట్టింది. ఇదిగో మా లవ్‌ పోస్టర్‌. దీనికి ఇదే సరైన సమయం అనిపిస్తుంది' అంటూ తనదైన స్టైల్‌లో నోట్ షేర్ చేశాడు.

అయితే, పరోక్షంగా రణ్‌బీర్‌-ఆలియా వివాహం గురించి చెప్పేందుకే ఈ లవ్‌ పోస్టర్‌ విడుదల చేసినట్లు తెలుస్తోంది. 2022 సెప్టెంబర్ 9న విడుదల కానున్న సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌని రాయ్‌ కీలక పాత్రల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story