- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rana: మహేష్ బాబు సినిమాలో విలన్ గా రానా .. రాజమౌళి ప్లాన్ సూపర్
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో కమ్ విలన్ రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రానా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. ఎవరని తేడా లేకుండా అందర్ని సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ హీరో భాషతో సంబంధం లేకుండా పాత్ర నచ్చితే సినిమాకి ఓకే చెబుతాడు. నాయకుడు మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.
బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. బాహుబలిలో భల్లాల దేవ పాత్రలో నటించిన రానా.. ఇటీవల రిలీజ్ అయిన వేట్టయాన్ మూవీలో కూడా విలన్‌గా కనిపించి అందర్ని అలరించాడు. ఈ మూవీలో కనిపించింది తక్కువ సమయమే అయిన మంచి రోల్ చేసాడు. ఇప్పుడు, రానాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం మనకీ తెలిసిందే. అయితే, ఈ సినిమాలో రానా విలన్ పాత్ర చేయబోతున్నాడంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. రాజామౌళి ఇప్పటికే రానాని అడగడంతో తాను ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర టీం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.