- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామ్‌దేవ్ బాబా కంపెనీ రూ. 4,300 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఇష్యూ
by Harish |
X
దిశ,వెబ్‌డెస్క్: యోగా గురు రామ్‌దేవ్ బాబా అధ్వర్యంలోని రుచి సోయా లిమిటెడ్ తన రూ. 4,300 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఇష్యూ మార్చి 24న ప్రారంభమై మార్చి 28న ముగుస్తుందని పేర్కొంది. రుచి సోయా ఆగస్టు 2021లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి ఆమోదం పొందింది. 2019లో, రుచి సోయాను రామ్‌దేవ్ కంపెనీ పతంజలి తన న్యూట్రెలా బ్రాండ్ కోసం రూ.4,350 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని తన వ్యాపారాన్ని విస్తరించడానికి, రుణాలను తిరిగి చెల్లించడానికి, పెరుగుతున్న వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి. సాధారణ కార్పొరేట్ కార్యకలాపాలను చేపట్టడానికి ఉపయోగిస్తుందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ ఇష్యూలో అర్హులైన ఉద్యోగుల సబ్‌స్క్రిప్షన్ కోసం 10,000 ఈక్విటీ షేర్లు రిజర్వ్ చేశారు. రుచి సోయా భారతదేశంలో సోయా ఫుడ్ కంపెనీలలో ఒకటిగా ఉంది. కంపెనీ 1980లలో న్యూట్రెలా బ్రాండ్‌ను ప్రారంభించింది.
Advertisement
Next Story