రామారావు ఆన్ డ్యూటీ.. టాక్ ఇదే

by samatah |
Ramarao on Duty Will be Released On July 29
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజ రవివతేజ హీరోగా తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై 29(ఈరోజున) థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసింది. ఈ రోజు విడుదలైన ఈ మూవీ ట్విట్టర్ రివ్యూ్ ఎలా ఉందో తెలుసుకుందాం.

ఖిలాడీ లాంటి సినిమాతో ఫ్లాప్ కావడంతో ఈ సినిమాపై రవితేజ చాలా హోప్స్ పెట్టుకన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో రవితేజ కలెక్టర్ క్యారెక్టర్‌లో మాస్ డైలాగ్స్‌తో అదరగొట్టేశాడంట. కలెక్టర్ పాత్రలో ఆయన ఒదిగిపోయినట్లు తెలుస్తోంది. కలెక్టర్ జాబ్ వదులుకొని రవితేజ ఊరికి వెళ్తాడు ఆ సమయంలో అక్కడ కొందరు మిస్సైన విషయాన్ని తెలుసుకుంటాడు. దీంతో వారందరినీ కాపాడే క్రమంలో హీరో తీసుకున్న స్టెప్స్ , ఆయన ఎదుర్కొన్న పరిస్థితులే సినిమా.

ఇక దీనికి ట్విట్టర్‌లో కొందరు యావరేజ్ టాక్ ఇస్తేంటే. మరికొందరు హిట్ టాక్ ఇస్తున్నారు. మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ శరత్ మందవ చాలా సమయం తీసుకున్నాడట. పాత్రలను పరిచయం చేయడం.. సాంగ్స్‌కు ఎక్కువ సమయం తీసుకున్నాడట. అయితే, సెకెండాఫ్ మాత్రం మిస్టరీ కేసును చేదించే సీన్లతో పాటు రవితేజ మార్క్ మాస్ సీక్వెన్స్‌లు అదిరిపోయేలా వచ్చాయని టాక్. కొందరు నెటిజన్లు బ్లాక్ బస్టర్ మూవీ అని ట్వీట్లు పెడుతున్నారు.

మూవీ ప్లస్ పాయింట్స్

రవితేజ యాక్టింగ్

బ్యాగ్రౌండ్ స్కోర్

యాక్ష్‌న్ సీన్స్

డైలాగ్స్

క్లైమాక్స్

మూవీ మైనస్ పాయింట్స్

థ్రిల్ మిస్సవడం

లాజిక్ లేని సీన్లు

సాంగ్స్‌కి టైమింగ్ మిస్సవడం

కామెడీ తక్కువగా ఉండటం

ఫస్ట ఆఫ్ నార్మల్

రేటింగ్ : 2.5/5

Advertisement

Next Story

Most Viewed