Satyaraj: బార్బరిక్ నుంచి సత్యరాజ్ లుక్ రిలీజ్... టీజర్ అప్‌డేట్ కూడా

by sudharani |
Satyaraj: బార్బరిక్ నుంచి సత్యరాజ్ లుక్ రిలీజ్... టీజర్ అప్‌డేట్ కూడా
X

దిశ, సినిమా: స్టార్ నటుడు సత్యరాజ్ (Satyaraj) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbaric). మోహన్ శ్రీవత్స్ (Mohan Sriwats) దర్శక్తత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ (Glimpses) ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహాభారతం (Mahabharata) ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘త్రిబాణధారి బార్బరిక్’ నుంచి సత్యరాజ్ పాత్రను రివీల్ చేస్తూ.. టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.

‘సత్యరాజ్‌ను డాక్టర్ శ్యామ్ కథుగా పరిచయం చేస్తున్నాము. ఇది అనాగరిక ప్రపంచంలో ఉన్నతంగా నిలిచే పాత్ర. జనవరి 3న ఉదయం 10 గంటలకు టీజర్ రాబోతుంది’ అని తెలిపారు. కాగా.. డైరెక్టర్ మారుతి (Director Maruti) సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిధాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో విశిష్ఠ ఎన్ సింహా, సంచి రాయ్, సత్యం రాజేశ్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేశ్, మొట్ట రాజేంద్ర, ఉదయ్ భాను తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed