పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం : ఎమ్మెల్యే శ్రీహరి

by Aamani |
పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం :  ఎమ్మెల్యే శ్రీహరి
X

దిశ, ఊట్కూర్ : జీఓ 69 ను ఈ నెల చివరి వరకు ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తారని వాకిటి శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలో శ్రీరామ్ నగర్ లోని ఎస్సీ కమ్యూనిటీ భవనం ను ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే స్థాయి వరకు రావడానికి అంబేద్కర్ ముఖ్య కారణమన్నారు. ఈ నెల చివరి వరకు జీవో 69 ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. జీవో 69 ను మూడుసార్లు ప్లాన్ మార్చడం జరిగిందని.. జీవో 69 ద్వారా మండలంలోని ప్రతి గ్రామానికి నీళ్లు వస్తాయన్నారు. ఊట్కూర్ ప్రాంతం సరస్వతి నిలయం అని.. అతి త్వరలోనే అన్నపూర్ణ మండలంగా మారుతుందన్నారు.

మండలానికి ఈనెల చివరి వరకు అంబులెన్స్ వస్తుందని ప్రకటించారు. మక్తల్ నియోజకవర్గానికి ఐదు ఇందిరా క్యాంటీన్, 5 అంబులెన్సులు నియోజకవర్గానికి వచ్చాయన్నారు. త్వరలోనే ఏడు మండలాలకు ఏడు సబ్ స్టేషన్ లు ఏర్పాటు రాబోతున్నాయన్నారు. మక్తల్ నియోజకవర్గంలో 341 కోట్లు.. ఊట్కూర్ మండల రైతులకు 72 కోట్లతో రుణమాఫీ జరిగిందన్నారు. రెండు ఎకరాల భూమి పోలీస్ స్టేషన్.. ఐదు ఎకరాల భూమి గ్రౌండ్ కొరకు.. గురుకుల పాఠశాల కొరకు భూములను గుర్తించాలని ఎమ్మెల్యే కోరారు. రాబోయే రోజుల్లో కనెక్టివిటీ రోడ్లను సైతం బాగు చేసుకుందామన్నారు.

త్వరలోనే 20 కోట్లతో కూడిన బీటీ రోడ్లు నియోజకవర్గానికి వస్తాయన్నారు. మక్తల్ నియోజకవర్గం రైతుల నియోజకవర్గం అని.. పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి కొరకు సలహాలను ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డిసిసి జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, ఎమ్మార్వో చింత రవి, ఎంపీడీవో ధనుంజయ గౌడ్, ఎస్సై కృష్ణంరాజు, మాజీ జడ్పీటీసీ సూర్యప్రకాశ్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యగ్నేశ్వర్ రెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కొక్కు శంకర్, అధికారులు, ఆయా పార్టీల నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed