Boney Kapoor : సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు నిర్మాత బోనీ కపూర్ మద్ధతు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-02 16:00:04.0  )
Boney Kapoor : సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు నిర్మాత బోనీ కపూర్ మద్ధతు
X

దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theater Incident)ఘటనలో హీరో అల్లు అర్జున్(Allu Arjun)కు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనికపూర్(Producer Boney Kapoor) మద్ధతు(Supports) పలికారు. ఓ ఇంటర్వ్యూలో బోనికపూర్ మాట్లాడుతూ అల్లు అర్జున్ కు మద్ధతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ను తప్పుపట్టడం సరికాదని..నిందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పుష్ప 2 సినిమాకు, హీరోకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో జనాలు ఎక్కువ మంది థియేటర్ కు రావడంతోనే ఈ ఘటన జరిగిందని బోనీ కపూర్ అభిప్రాయపడ్డారు. దక్షిణాది ప్రేక్షకులకు సినీ నటుల పట్ల అభిమానం ఎక్కువని, అజిత్ సినిమా అర్ధరాత్రి షోకు నేను వెళ్లినప్పుడు అక్కడ 20వేల మంది వరకు ఉన్నారని, ఓ థియేటర్ వద్ధ అంతమందిని చూడటం అదే తొలిసారి అని బోనికపూర్ చెప్పుకొచ్చారు.

చిరంజీవి, రజనీకాంత్, అల్లు అర్జున్ లాంటి హీరోల సినిమాలకు మొదటి రోజు ప్రేక్షకులు చాలామంది వస్తారన్నారు. ఆరోజు థియేటర్ దగ్గర కొన్ని వేల మంది ఉన్నారని..అనుకోకుండా జరిగిన ఘటనకు అల్లు అర్జున్ ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదని బోని కపూర్ తేల్చిచెప్పారు. అల్లు అర్జున్ కు మద్ధతుగా బోనికపూర్ చేసిన వ్యాఖ్యలను బన్నీ అభిమానులు వైరల్ చేస్తున్నారు.

Read More ....

Pushpa-2:సంధ్య థియేటర్ ఘటన.. పుష్ప-2 నిర్మాతలకు హైకోర్టులో ఊరట!


Next Story