Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-03 11:13:59.0  )
Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటించిన గేమ్ చేంజర్ సినిమా(Game Changer Movie) విడుదలకు సర్వం సిద్ధమైంది. జనవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం చిత్రబృందం మొత్తం ప్రమోషన్స్ చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ(జనవరి 2, 2025) సాయంత్రం 5 గంటల తర్వాత గేమ్ చేంజర్ నుంచి ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. దిగ్గజ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) ఈ ట్రైటల్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో చరణ్ ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్ అయ్యేలా ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీమిండియా స్టార్ క్రికెటర్స్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya), కృనాల్ పాండ్యా(Krunal Pandya)లతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇదిలా ఉండగా.. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.

Advertisement
Next Story