రూ,100కోట్లు ఇస్తే రాజ్యసభ సీటు ఇస్తాం..

by GSrikanth |
రూ,100కోట్లు ఇస్తే రాజ్యసభ సీటు ఇస్తాం..
X

న్యూఢిల్లీ: రాజ్య‌సభ సీటు రూ.100 కోట్లకు ఇస్తామన్న ముఠాను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుంది. నగదు చేతులు మారుతున్న తరుణంలో అధికారులు నిందితుడిని పట్టుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎంపీ సీటుతో పాటు గవర్నర్ పదవిని కూడా ఆఫర్ చేసినట్లు వారు తెలిపారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేదా సీబీఐ గత కొన్ని వారాలుగా ఫోన్ ఇంటర్‌సెప్ట్ ద్వారా కాల్‌లను వింటున్నారని, నిందితులను గుర్తించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. పక్కా సమాచారంతో నలుగురిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో మహారాష్ట్ర వాసి కర్మలాకర్ ప్రేమ్‌కుమార్ బండ్‌గర్, కర్ణాటక వాసి రవీంద్ర విఠల్ నాయక్, ఢిల్లీ వాసులు మహేంద్ర పాల్ అరోరా, అభిషేక్ బూరాగా గుర్తించారు. నిందితులు రాజ్యసభ, గవర్నర్‌షిప్ లేదా ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఛైర్‌పర్సన్‌గా నియామకం చేస్తానని తప్పుడు హామీ ఇవ్వడం ద్వారా ప్రజలను మోసం చేయడానికి విస్తృతమైన రాకెట్‌ను నడిపారని వర్గాలు తెలిపాయి. అభిషేక్, కర్మలాకర్ వారికున్న కనెక్షన్‌లను ఈ రాకెట్‌కు వినియోగించుకున్నట్లు నిర్ధారించారు. అంతేకాకుండా సీబీఐ అధికారుల ముంటూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే సీబీఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఈ నలుగురు కలిసి సీనియర్ అధికారులు, రాజకీయ నాయకుల పేర్లను ఉపయోగించి క్లయింట్‌లను ఆకట్టుకునేవారని సీబీఐ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. అంతేకాకుండా సీనియర్ అధికారులమని చెప్పి పోలీసు అధికారులను కూడా నమ్మించారని తెలిపింది.

Advertisement

Next Story