- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా జీవితానికి అర్థమే లేకుండా పోయింది.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్ తన జీవితంలో ఆనందం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సాధారణ వ్యక్తిగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఇండస్ట్రీలను ఏలే స్థాయికి ఎదిగినప్పటికీ, వ్యక్తిగతంగా తన లైఫ్‌లో పది శాతం కూడా సంతోషం మిగల్లేదన్నాడు. చెన్నైలో 'హ్యాపీ సక్సెస్‌ఫుల్ లైఫ్ త్రూ క్రియ యోగ' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన రజనీ పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. 'నేను గొప్ప నటుడినని అందరూ అంటారు. ఇది ప్రశంసో, విమర్శో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. రాఘవేంద్ర, బాబా సినిమాలు మాత్రమే నాకు ఆత్మ సంతృప్తినిచ్చాయి. బాబా సినిమా చూశాక చాలామంది హిమాలయాలకు వెళ్లామని చెప్పారు. కొంతమంది నా అభిమానులు సన్యాసులుగా మారిపోతే.. నేను మాత్రం నటుడిగా ఇక్కడే ఉండిపోయా. జీవితంలో డబ్బు, పేరు ప్రఖ్యాతలు అన్నీ చూశాను. సంతోషం, ప్రశాంతత మాత్రం కావాల్సినంత దక్కలేదు' అని తెలిపాడు.