Erra Cheera : రాజేంద్ర ప్రసాద్ మనవరాలు నటించిన కొత్త సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..

by Prasanna |
Erra Cheera : రాజేంద్ర ప్రసాద్ మనవరాలు నటించిన కొత్త  సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్..
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ పద్మయాళ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా కలిసి నిర్మించిన చిత్రం “ ఎర్రచీర – ది బిగినింగ్”. ఎన్‌వివి సుబ్బారెడ్డి నిర్మాణంలో సుమన్ బాబు డైరెక్షన్ లో రాజేంద్రప్రసాద్ మనమరాలు, సాయి తేజస్విని, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు పలువురు నటీ నటులు ఈ సినిమాలో నటించారు.

నేడు దసరా సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 30న “ఎర్రచీర ” సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ తరుణంలో చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు, గ్రాఫిక్స్ కార్యక్రమాలు పూర్తయినట్లు దర్శక, నిర్మాతలు ప్రకటించారు. కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌తో కూడిన సన్నివేశాలు 45 నిమిషాల పాటు ఈ సినిమాలో ఉంటాయి. తల్లి భావాలను తెలిపే హారర్ చిత్రంగా దీన్ని రూపొందించాము. సినిమా క్లైమాక్స్‌లో తల్లి భావోద్వేగాలు ప్రేక్షకులను ఏడిపిస్తాయని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed