- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుల్లూరులో ఫుల్లు వర్షం (వీడియో)
దిశ, అలంపూర్/ మానోపాడు: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరు నియోజకవర్గంలోని అయిజ, మానోపాడు, ఉండవెళ్లి, అలంపూర్ మండలాల్లో పలు చోట్ల మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 6.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. అలంపూర్ పట్టణ పరిధిలోని అంబర్ పేట కాలనీ జలమయంకాగా చాలా మంది బిక్కు బిక్కుమంటూ గడిపారు. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇంటి సామాగ్రితో కాలనీలను వదిలి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్తున్నారు. అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు మండి పడుతున్నారు. అదేవిధంగా ఉండవెళ్లి మండలంలోని పుల్లూరులో ఇదే పరిస్థితి నెలకొంది. పలు కాలనీలలోని రోడ్లపైకి అడుగు మేరకు వర్షపు నీరు చేరింది. 2009లో అప్పటి వరదలను తలపించేలా వర్షం కురిసిందని, ఏ క్షణం ఏమవుతుందో అనే విధంగా భారీ వర్షం కురిసిందని గ్రామస్తులు తెలిపారు. అయిజ మండలంలోని తిత్తినోనిదొడ్డి గ్రామం దగ్గర పెద్ద వాగు ఉప్పొంగుడంతో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అలంపూర్ లోని పాపనాశినికి వెళ్లి దారిలో వాగు ఉప్పొంగి ప్రవహించింది. కాశాపురం గ్రామంలో కూడా భారీ వర్షం కురువటంతో లోతట్టు కాలనీలకు వర్షపు నీరు చేరింది. ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాల్లో ఇదే పెద్ద వర్షమని రైతులు అంటున్నారు. వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో ఆయా గ్రామాల ప్రజలు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు.