శంకర్‌పల్లిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

by S Gopi |
శంకర్‌పల్లిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
X

దిశ, శంకర్ పల్లి: శంకర్ పల్లిలో శనివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అప్పటివరకు సూర్యుని ప్రతాపంతో ఉక్కిరి బిక్కిరి చేసిన ప్రకృతి ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం విపరీతమైన గాలులు వీస్తూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సుమారు అర్ధగంట సేపు వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ప్రజలు, రైతులు, వినియోగదారులు వర్షంలో తడిసి ముద్దయ్యారు. వేసవి కాలం ఎండలు మండుతున్న ప్రస్తుత సమయంలో వర్షం కురవటంతో ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story