- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
30 స్టార్ క్యాంపెయినర్లతో కాంగ్రెస్ ప్రచారం: సోనియా, రాహుల్, జైరాంరమేష్‌కు చోటు
ఇంఫాల్: మణిపూర్‌లో ప్రచారానికి కాంగ్రెస్ పెద్ద ఎత్తున సిద్ధమైంది. 30 మంది స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారాలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు 30 మంది జాబితాను సోమవారం విడుదల చేసింది. దీనిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, జైరాం రమేష్‌లు ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర మాజీ సీఎం ఒక్రాం ఇబోబి సింగ్, మాజీ డిప్యూటీ సీఎం గైకాంగం, యువ నేత కన్హయ్య కుమార్ కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే యూపీలో కూడా ఇదే తరహా జాబితాను కాంగ్రెస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సోనియా గానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గానీ ఎటువంటి ర్యాలీలో పాల్గొనలేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌తో పాటు మరో ఐదు పార్టీలు మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్‌ను గత వారం ప్రకటించాయి. వీటిలో సీపీఐ, సీపీఎం, ఆర్‌ఎస్పీ, జేడీ(ఎస్), ఫార్వార్డ్ బ్లాక్ ఉన్నాయి.