దేశంలో అత్యంత అవినీతిగా కర్ణాటక ప్రభుత్వం: Rahul Gandhi

by Harish |   ( Updated:2022-04-01 11:21:59.0  )
దేశంలో అత్యంత అవినీతిగా కర్ణాటక ప్రభుత్వం: Rahul Gandhi
X

బెంగళూరు: కాంగ్రెస్ ఎంపీ, కీలక నేత రాహుల్ గాంధీ కర్ణాటక బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కర్ణాటకనేనని అన్నారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. బీజేపీ ఆర్థిక బదిలీ యంత్రాంగంపై పనిచేస్తుంది. పేదల నుంచి డబ్బులు సేకరించి, దేశంలోని కొద్ది మంది ధనికులైన వ్యాపారవేత్తలకు ఇస్తుంది అని అన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని తెలిపారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగాయి, దేశంలో ఇదే అతిపెద్ద సమస్యలుగా ఉన్నాయని చెప్పారు. ఒకవేళ బీజేపీ కోరుకున్న ప్రజలకు ఉద్యోగాలు కల్పించలేదని తెలిపారు. ఎందుకంటే ఇప్పటికే ఉపాధి కల్పన రంగాన్ని నాశనం చేశారని అన్నారు. 'కర్ణాటక ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిని ఇస్తుంది. ఇది పార్టీకి సహాజ రాష్ట్రం. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. 150కి తక్కువ కాకుండా గెలుస్తాం. మేము తిరిగి కర్ణాటకను అభివృద్ధి దారిలో నడిపిస్తాం' అని అన్నారు. రాష్ట్రంలో పనితీరు ఆధారంగా అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తామని చెప్పారు. తాము ఎన్నికల్లో ఫలితాల కోసం కాకుండా, నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పోరాటం చేస్తామన్నారు. వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కసరత్తులు ప్రారంభించింది.

Advertisement

Next Story