- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Drugs Case: కండ్లకోయ వద్ద భారీగా డ్రగ్స్ పట్టివేత..
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకుని ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనితో పోలీసులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా పక్క సమాచారం రావడంతో శుక్రవారం రాచకొండ పోలీసులు రైడ్స్ చేశారు. కండ్లకోయ వద్ద డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. పాపి సీడ్స్ ద్వారా మార్ఫిన్, హెరాయిన్ తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.3 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ ముఠాలు కొత్త దారుల్లో డ్రగ్స్ తయారు చేస్తున్నాయని చెప్పారు. నిందితులు గసగసాలతో డ్రగ్స్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. పంజాబ్ నుండి తెలంగాణకు డ్రగ్స్ వస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా పంజాబ్ నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు.
Advertisement
Next Story