తుప్పుపట్టిన రిక్షాలే దిక్కా.. ఇబ్బందులు పడుతున్న పారిశుధ్య కార్మికులు

by Web Desk |
తుప్పుపట్టిన రిక్షాలే దిక్కా.. ఇబ్బందులు పడుతున్న పారిశుధ్య కార్మికులు
X

దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ సర్కిల్ సూర్యనగర్ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం కాలనీలోని రోడ్లను ఇద్దరు కార్మికులు శుభ్రం చేయం ప్రారంభించారు. అయితే కోట్లాది రపాయలు వెచ్చించి స్వచ్ఛ ఆటోలను తీసుకువచ్చామని చెబుతున్న ప్రభుత్వం ఈ కార్మికులకు ఇవ్వడం మరిచారా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి గ్లౌజులు లేకుండా రెండు అట్ట పెట్టెలతో చెత్తను రిక్షాలో వేసుకుంటున్నారు. వాహనం ఏమో గానీ కనీసం గ్లౌజులైనా ఇప్పించాలని కార్మికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.




Advertisement

Next Story