- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్పోరేట్‌కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు: అడీషనల్ కలెక్టర్ వీరారెడ్డి
దిశ,ఆందోల్ : కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. గురువారం తొలి విడతలో ఎంపికైన పుల్కల్ మండలం సింగూరు, అందోల్ మండలం అక్సాన్ పల్లి, వట్ పల్లి మండలం ఖాదిరబాద్ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను అన్ని హంగులతో తీర్చిదిద్దుకునే అద్భుతమైన కార్యక్రమం మన ఊరు- మన బడి అన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నందున జూన్ లోగా అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలో కల్పించే వసతుల పై గ్రామాల్లో అవగాహన కల్పించాలని, దాతల నుంచి పాఠశాల అభివృద్ధి కొరకు నిధులు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంఈఓ లు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సెక్రటరీలు, జడ్పీటీసీ, సర్పంచ్లు పాల్గొన్నారు.