నిర్మాతను బెదిరించిన యాంకర్ రష్మీ.. గేటుకు కట్టేస్తానన్న ప్రొడ్యూసర్!

by Satheesh |
నిర్మాతను బెదిరించిన యాంకర్ రష్మీ.. గేటుకు కట్టేస్తానన్న ప్రొడ్యూసర్!
X

దిశ, సినిమా: 'జబర్దస్త్' షోతో పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ గౌతమ్ తెలుగులో 'గుంటూర్‌ టాకీస్‌', 'అంతం' వంటి పలు చిత్రాల్లో లీడ్‌రోల్స్ చేసింది. ప్రస్తుతం 'రాణి గారి బంగ్లా' సినిమాలో ఆమె నటిస్తుండగా.. రష్మీ తనని ఇబ్బంది పెట్టిందని ఆ మూవీ ప్రొడ్యూసర్ బాలాజీ నాగలింగం ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ సినిమాలోని ఓ పాటకు తాను డబ్బింగ్ చెప్పనంటూ ఇబ్బంది పెట్టడమే కాకుండా, హీరోని కూడా మార్చాలని డిమాండ్‌ చేసినట్లు ఆయన తెలిపాడు. ఈ విషయంపై తనని ఒప్పించేందుకు ప్రయత్నిస్తుండగా చాలా దురుసుగా వ్యవహరిస్తూ.. నాగబాబు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తనకు తెలుసని రష్మీ బెదిరించిందన్నాడు. ఆమెతో మాట్లాడిన రికార్డింగ్ ఇప్పటికీ తన దగ్గర ఉందని సదరు నిర్మాత వెల్లడించాడు. న్యాయం కోసమే ఆమెను ఫిల్మ్ చాంబర్ గేటుకు కట్టివేస్తానని బెదిరించానని, ఉద్దేశపూర్వంగా చేసిన వ్యాఖ్యలు కాదన్నాడు.

Advertisement

Next Story