taskarinchuta: ప్రేక్షకుల మనసుల్ని ‘తస్కరించుట’ తస్కరించాలి: నిర్మాత

by sudharani |
taskarinchuta: ప్రేక్షకుల మనసుల్ని ‘తస్కరించుట’ తస్కరించాలి: నిర్మాత
X

దిశ, సినిమా: యువ నటుడు సన్నీ (Sunny) హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘తస్కరించుట’ (taskarinchuta). రెచెల్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1 మూవీగా ప్రొడ్యూసర్ షేక్ అఫ్రీన్ నిర్మిస్తున్నా ఈ చిత్రానికి శివ ప్రసాద్ (Shiva Prasad) దర్శకత్వం వహిస్తు్న్నాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీ ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్ (Hyderabad) రామానాయుడు స్టూడియో (Ramanaidu Studio)లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యంగ్ హీరో ఆకాష్ పూరి, ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆకాష్ పూరి (Akash Puri) మాట్లాడుతూ.. ‘‘సత్కరించుట’ మూవీ టైటిల్ పోస్టర్ బాగుంది. హీరోగా పరిచయం అవుతున్న సన్నీకి కంగ్రాట్స్ (congrats). మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అంటే చెప్పుకొచ్చాడు.

నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) మాట్లాడుతూ.. ‘చిన్న చిత్రాలు ఆదరణ పొందాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఆకాష్ పూరి ఈ ఓపెనింగ్‌కు రావడం సంతోషంగా ఉంది. తస్కరించుట సినిమాతో ఈ మూవీ టీమ్ ప్రేక్షకుల మనసుల్ని తస్కరించాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed